ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే స్టార్‌గా మారాల‌ని కొంద‌రు చేస్తున్న వింత‌ ప‌నులు అంద‌రినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. అయితే మామూలుగా రీల్స్ చేస్తే ఎవరూ చూడరని కాస్త వెరైటీగా వీడియోలు చేయాలని కొత్త కొత్త చెత్త ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. అంతేకాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరైతే రోడ్లపై పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ కావడానికి కూడా ప్రయత్నించారు. తాజాగా, అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు ‘శవం’ అవతారమెత్తాడు.

వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటనలో పాపులారిటీ కోసం ఒక వ్యక్తి విచిత్రమైన అవతారం ఎత్తాడు. ముఖేష్ కుమార్‌ అనే 23ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం శవంలా రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించాడు. రోడ్డులో ఒకవైపు బారీకేడ్ పెట్టి బ్లాక్ చేసి దాని సపోర్ట్ తీసుకుని అంతక్రియాలు జరిపే సీన్‌ల.. కదలకుండా శవం మాదిరి తెల్లటి వస్త్రం వేసుకుని పడుకున్నట్లు నటించాడు. తనపై తెల్లని దుప్పటి, ముక్కులో దూది, మెడలో దండ, దుప్పటిపై గులాబీ పూలు లాంటివి ఇన్‌స్టాలో రీల్‌ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు. ఇక వీడియో తీయడం ముగిసిన వెంట‌నే పగలబడి నవ్వుతూ ముకేశ్‌ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో, అది చూసిన స్థానికులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఈ వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తాజాగా స్థానిక పోలీసులు ఆ యువకుడిని, తన స్నేహితులను  అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వీడియో వైరల్ కావడంతో దీనిపై నెట్టింట‌ పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యూస్, లైక్‌ల కోసం ఇలాంటి పిచ్చి ప‌నులేంటి అని మండిపడ్డారు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *