ముంబై లోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన కూరగాయలమ్ముకునే మహిళ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిన సందర్భానికి చెందిన వీడియో ఇది. ఆమె కొడుకు కఠినమైన సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న మహిళ కొడుకును కౌగిలించుకుని సంతోషంలో మునిగిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
చదువు పట్ల మక్కువ ఎంతో ఎక్కువ, బాగా చదువుతున్న కొడుకును ప్రోత్సహించేందుకు తొంబరే (కూరగాయలమ్ముకునే మహిళ) ఎంతో కష్టపడింది. యోగేష్ చదువులో రాణించి సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఛార్టెడ్ అకౌంటెంట్ హోదాను పొందాడు. ఆ విషయం చెప్పగానే కూరగాయల దుకాణంలో కూర్చున్న తొంబరే ఎంతో ఆనంద పడింది. కొడుకును కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఎమోషనల్ వీడియోను మంత్రి రవీంద్ర పోస్ట్ చేశారు.