ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. యూట్యూబర్ హర్షసాయి తనపై అత్యాచారం చేసాడని,పెళ్లి చేస్కుంటా అని నమ్మించి మోసం చేశాడంటూ ఓ బాధిత యువతీ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్షసాయి తండ్రి మీద కూడా ఫిర్యాదు రావడంతో ఆ కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లింది. హర్ష సాయి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
హర్షసాయి ముంబయిలో ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంపై హర్షసాయి తొలిసారి స్పందించారు. ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. త్వరలోనే నిజానిజాలు బయటపడుతాయి అని, డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారంటూ హర్షసాయి పేర్కొన్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, తన గురించి అందరికీ తెలుసునని, త్వరలోనే వాస్తవం బయటకు వస్తుందని హర్షసాయి తెలిపారు.