బిహార్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడి 60 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 43 మంది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తలను పాటించాలని రెండు రాష్ట్రాల అధికారులు ప్రజాలకు తెలియజేసారు. వర్ష కాలంలో పిడుగులు పడడం మాములు విషయం అని నిపుణులు చెబుతున్నారు.
అసాధారణ పిడుగులకు కారణం:
ఈ రెండు రాష్ట్రాలు ముందు పొడి ప్రాంతంగా ఉండేవి.రుతుపవనాల ద్రోణి ఉత్తరం వైపుకు మారడం ప్రారంభించినప్పుడు, తేమ చొరబాటు వల్ల అకస్మాత్తుగా చాలా ఉష్ణమండల మేఘాలు అభివృద్ధి చెందాయి. దానివల్ల పెద్ద సంఖ్యలో పిడుగులు పడుతున్నాయి’’ అని స్కైమెట్ (SKYMET) వాతావరణ విభాగం వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ చెప్పారు.