News5am, Breaking News Telugu (11-06-2025): వర్షాకాలంలో పండ్లు తినడంలో జాగ్రత్తలు అవసరం. తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల పండ్లు త్వరగా పాడవుతాయి మరియు బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ అయిన సీతాఫలం, జామ, మామిడి, లిచీ వంటి పండ్ల విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. సీతాఫలం తడి ఎక్కువగా ఉండే పండు కావడంతో త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది, అందుకే తాజాగానే తినాలి. జామపండు కూడా లోపల పురుగు పెరిగే అవకాశం ఉండటం వల్ల, ముక్కలుగా కట్ చేసి చూసుకుని తినాలి.
ఇంకా, మామిడి పండ్లు వర్షాకాలంలో ఎక్కువగా పాడవుతాయి, వీటిలో ఫంగస్ ఉండే అవకాశం ఉండటంతో పూర్తిగా పండినవి తినడంలో జాగ్రత్త వహించాలి. పండిన మామిడి వల్ల కొన్ని సార్లు అలెర్జీలు కూడా రావచ్చు. లిచీ పండు కూడా సీజనల్ అయినదే అయినా, నిల్వలుపై శ్రద్ధ లేకపోతే త్వరగా పాడైపోతుంది. అందుకే వర్షాకాలంలో పండ్లు తినేటప్పుడు వాటి తాజా స్థితిని గమనించి, శుభ్రంగా తీసుకొని తినాలి.
More Breaking News:
News Telugu:
ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ బదులు వీటిని తాగండి..
More Breaking News Telugu: External Sources
ఈ పండ్లు తిన్నారంటే.. దవాఖానాకు పరిగెత్తాల్సిందే..