ఉదయం నిద్ర లేవగానే టీ లేకపోతే ఆ రోజు ఏ పని మీదా ఆసక్తి ఉండదు. ఆ తర్వాత టిఫిన్‌కు ముందు ఒకటి, టిఫిన్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం, సాయంత్రం, మొత్తంగా రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతుంటారు. జీవితంలో టీ అనేది అంతగా భాగమైంది.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ప్రేగులపై ప్రభావం చూపుతుంది మరియు కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ మరియు అజీర్ణానికి కారణమవుతుంది. జీర్ణవ్యవస్థలో ఇబందులు వస్తాయి. కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ మరియు పెప్టిక్ అల్సర్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. ఉదయం అల్పాహారం లేకుండా పాలతో చేసిన కాఫీ, టీ తీసుకోవద్దు.
అయితే పరగడుపునే టీ తాగాలనుకునేవారు టీ తాగడానికి పావుగంట ముందు మంచినీరు తాగాలి. దీనివల్ల ఆరోగ్యానికి కొంత ముప్పు తగ్గుతుంది.