Health Tips

Health Tips: ఇప్పుడు ఉన్న తక్షణ జీవనశైలిలో చాలామంది ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వుంటున్నారు. నిద్ర సరిగ్గా లేకపోవడం, సరైన సమయంలో తినకపోవడం, మారిన ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో చాలా తక్కువ వయసులోనే అలసటగా, బలహీనంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చర్మంపై వచ్చే ముడతలు, వదులుదనం, కాంతి లేకపోవడం వంటి లక్షణాలను తరచూ పట్టించుకోకుండా మేకప్‌తో దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ ముడి సమస్య శరీరానికి లోపలి నుంచి పోషణ లేనందే అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తగ్గించేందుకు సహజంగా చర్మాన్ని మెరిపించే పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

అందులో మొదటిగా నారింజ విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉండి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. జామున్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి చర్మ కణాలను కాపాడుతాయి. దానిమ్మలో పాలీఫెనాల్స్ అనే పదార్థం చర్మానికి పోషణ ఇవ్వడం ద్వారా మచ్చలు పోయేలా చేస్తుంది. అలాగే ఆపిల్‌లోని ఫైబర్, విటమిన్ సి చర్మాన్ని హైడ్రేట్ చేసి ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజమైన అందాన్ని పొందవచ్చు.

Internal Links:

షుగర్ పేషంట్స్ బంగాళదుంపలు తినవచ్చా..

ఈ పండ్లు తిన్నారంటే.. దవాఖానాకు పరిగెత్తాల్సిందే..

External Links:

యంగ్ గా, అందంగా కనిపించాలనుకుంటున్నారా?.. జస్ట్ ఈ పండ్లను డైట్ లో చేర్చుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *