Latest Telugu News

News5am, Latest Telugu News Desk (17-05-2025): మనుషులకు అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) ఒక ప్రమాదకరమైన సమస్య. ఇది “నిశ్శబ్ద హంతకుడు” (సైలెంట్ కిల్లర్)గా భావించబడుతుంది. ప్రతి ఒక్కరూ దీనిపై సరైన అవగాహన కలిగి ఉండాలి. దీని ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలకు తీవ్రమైన హానిని కలిగించగలదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు, బీపీని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం చాలా అవసరం. భారతదేశంలో సుమారు 22 కోట్ల మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. అందులో సగం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలియకపోవడమే అత్యంత ఆందోళనకర విషయం.

రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. సాధారణంగా 140/90ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువ బీపీ ఉన్నట్లయితే హైపర్‌ టెన్షన్‌గా పరిగణిస్తారు.

  • రీడింగ్‌ 140/90 ఎంఎంహెచ్‌జీ ఉంటే తేలికపాటి హైపర్‌ టెన్షన్‌
  • 140/90 నుంచి 159/99ఎంఎంహెచ్‌జీ మధ్య ఉంటే స్టేజ్‌-1 హైపర్‌ టెన్షన్‌

-160/100 ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువైతే స్టేజ్‌-2 హైపర్‌ టెన్షన్‌

-180/110ఎంఎంహెచ్‌జీ కంటే ఎక్కువైతే హైపర్‌ టెన్సివ్‌ ఎమర్జెన్సీ అంటారు. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది.

ప్రారంభంలో లక్షణాలు లేకపోయినా, తీవ్రమైన లేదా నియంత్రణలో లేని రక్తపోటు తలనొప్పి, తల తిప్పుడు సమస్యలను కలిగించవచ్చు. చూపు మబ్బుగా ఉండటం, తీవ్ర అలసట, ఛాతిలో నొప్పి, గుండె చప్పుళ్లలో మార్పులు, అసమానంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సంకేతాలు కనబడవచ్చు. ఇలాంటి లక్షణాలను గమనించి వెంటనే వైద్యసాయం తీసుకోవాలి. మందులతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేసే జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా కీలకం.

More News:

Latest Telugu News Desk

అల్లు అర్జున్-అట్లీ సినిమా, రిలీజ్ డేట్ లాక్..

ఎడతెరిపి లేని వర్షాలు..

More Latest Telugu News: External Sources

https://www.andhrajyothy.com/2025/health/world-hypertension-day-early-detection-of-high-blood-pressure-can-prevent-organ-damage-ksv-1405309.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *