News5am, Latest Telugu New’s (2025-05-13): కొంచెం వేడి ఎక్కువగా అనిపించినా లేకా స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్న సందర్భాల్లో వెంటనే కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి ఒక్కసారిగా తాగేస్తారు. ఇళ్లలో కూడా కూల్ డ్రింక్స్ నిల్వ ఉంచి పిల్లలకూ, ఈ రుచిని అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మైనసే. అయినా వేసవిలో వేడి తగ్గించేందుకు అవి ఎక్కువగా తాగుతారు. అయితే, వేసవి కాలంలో శరీరానికి శక్తినిస్తూ ఆరోగ్యానికి మంచిగా సహజమైన పానీయాలు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఆరోగ్యకరమైన సహజ పానీయాల గురించి తెలుసుకుందాం.
క్యారెట్: ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది.
కీరా: ఇందులో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా, కీరాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. సహజంగా బరువు తగ్గాలను కున్నా, చర్మం ఆరోగ్యంగా ఉం డాలనుకున్నా కీర దోస జ్యూస్ తాగడం మంచిది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది కూడా.
మామిడి రసం: మామిడి తినకుండా, రసం తాగకుండా వేసవి పూర్తి కాదు. పచ్చి మామిడి రసం ఎండవల్ల చర్మం దెబ్బతినకుండా కాపా డుతుంది.
నిమ్మరసం: ఇది శరీరాన్ని, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జ్యూస్ పక్కాగా తీసుకోవాల్సిందే.
పుదీనా రసం: పుదీనా జ్యూస్ వేసవి వేడితో పోరాడి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
టొమాటో: వీటిలో విటమిన్-సీ, యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. పోషక విలుకలు కూడా అధికం. అందుకే ఈ సీజన్ లో టొమాటో జ్యూస్ తాగితే మంచిది
More Latest Telugu New’s
latest Telugu New’s:
సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల..
రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..