నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ సి, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా బరువు నియంత్రణకు మరియు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు, పప్పులతో చేసిన ఆహారాన్ని తినేటప్పుడు, దానికి నిమ్మరసం కలపండి. ఇలా తినడం వల్ల ప్రొటీన్లు గ్రహించి విటమిన్ సి అందుతుంది. కానీ కొన్ని ఆహారపదార్థాలతో నిమ్మరసం తినడం మంచిది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు రావొచ్చు.మజ్జిగలో నిమ్మరసం కలపకూడదు. ఇది జీర్ణక్రియకు మంచిది కాదు.
పాల ఉత్పత్తులు:నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. పాలు లేదా పెరుగు, జున్ను,ఏదైనా పాల ఉత్పత్తులతో కలిపితే, అది పాల యొక్క ఆకృతిని పాడు చేస్తుంది. అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ భాగాలు ఉంటాయి. నిమ్మరసం కలిపి తింటే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి.
స్పైసీ ఫుడ్:బిర్యానీలు మరియు పులావ్ వంటి స్పైసీ ఫుడ్స్‌లో మసాలా పుష్కలంగా ఉంటుంది. చాలా మంది వాటిపై నిమ్మరసం చల్లుకుని తింటారు. నిజానికి ఇలాంటి స్పైసీ ఫుడ్ లో నిమ్మరసం కలపకూడదు. ఉడికించిన చేపలు మరియు మాంసానికి నిమ్మరసం కలపవద్దు. ఇది చేపల రుచిని పాడు చేస్తుంది.