వర్షాకాలంలో బాగా దొరికే పండ్లు నేరేడు పండ్లు. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేరేడు పండ్లలో శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు మరియు పోషకాలు ఉన్నాయి. అయితే నేరేడు పండ్లను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. కానీ నేరేడు పండ్లను తిన్న వెంటనే నీళ్లు, పాలు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. నేరేడు పండు తిన్న 40 నిమిషాల తర్వాత నీరు త్రాగాలని సూచిస్తున్నారు. నేరేడు పండ్లని అతిగా తినడం వల్ల కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు, చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
నేరేడు పండులో చక్కెరను తగ్గించే గొప్ప గుణాలు ఉన్నాయి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లను తినకూడదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి సీజనల్ ఫ్రూట్ అయిన నేరేడు పండు తినడం గురించి మీ వైద్యుల సలహా తీసుకోండి. ఏదైనా మితంగా తినడం సమస్య కాదు. అలాగే అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.