పెరుగు అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. పెరుగన్నంలో ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పెరుగులో విటమిన్ బి12, విటమిన్ బి5, విటమిన్ బి2, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి.రాత్రి వేళలో పెరుగన్నం తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పగటిపూటతో పోలిస్తే రాత్రి సమయంలో జీవక్రియ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రివేళ పెరుగన్నం కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకుండా ఉండడం మంచిది. దగ్గుతో బాధపడేవారు, ఊబకాయం ఉన్నవారు, రక్తస్రావం రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న వారు, ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు పెరుగును తినకపోవడం మంచిది. రాత్రి వేళల్లో పెరుగు తినడం వల్ల త్వరగా జీర్ణం కాక కడుపు అంతా బరువుగా అనిపిస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు రావొచ్చు, రాత్రి వేళల్లో పెరుగు తింటే బరువు పెరగడం, మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.