ప్రతి ఒక్కరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలం చేకూరడమే కాదు, బియ్యం కడిగిన నీటిలో కూడా లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టిన తరువాత, ఆ నీటిని చర్మ ఆరోగ్యంలో భాగంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ రైస్ వాటర్ ప్రధానంగా కొరియన్ చర్మ సంరక్షణలో చాలా మంది ఉపయోగిస్తారు. ఇది ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది.

బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. బియ్యం కడిగిన నీటి వల్ల మీ చర్మం మెరుస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యలతో బాధపడేవారు రోజూ బియ్యం నీళ్లను ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *