అన్ని వయసుల వారికీ చర్మ సమస్యలు వస్తాయి. ఎక్కువగా వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి చర్మ వ్యాధులు వస్తాయి. దీనికి కారణం తేమ మరియు బాక్టీరియా వేగంగా పెరగడం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల దురద, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. వీటిని ఆపడానికి కొన్ని హోమ్ రెమిడీస్ చుదాం.
టీ ట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షని తగ్గించడానికి చాల బాగా పనిచేస్తుంది. ప్రభావిత ప్రాంతంలో దీనిని క్రమం తప్పకుండా అప్లై చేయాలి. పెరుగు తీసుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పెరుగు తినేటపుడు దానిలో చక్కెర, ఉప్పు వంటివి వాడకూడదు, సాధారణ పెరుగు మాత్రమే తినాలి. ప్రతి ఇంట్లో వెల్లుల్లి సులభంగా దొరుకుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి దీనిని ఉపయోగించవచ్చు. వెల్లుల్లిని బాగా దంచి, దానిని చర్మాం ఫై అప్లై చేయాలి. వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మ సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు.