ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వీళ్లలో చాలామంది వేగంగా బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా త్వరగా బరువు తగ్గడం వల్ల కొత్త సమస్యలు ముంచుకొస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. అసలు నెలకు ఎంత బరువు తగ్గితే మంచిది అనే విషయాలు మొదటగా తెలుసుకోవాలి. బరువు పెరగాలన్న, తగ్గాలన్న ఒక ప్రక్రియ ఉంటుంది , క్రమ పద్దతిగా పట్టిస్తే తప్పకుండ మంచి ఫలితాలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలి అంటే ఎం చేయాలో చూద్దాం. మొదటగా బరువు తగ్గడానికి ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. ఎవరు అయితే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్లు ముందు డైట్ తో మొదలుపెట్టాలి.
- హై క్యాలరీ ఫుడ్స్ మానేసి పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఎక్కువగా ఫైబర్ పదార్దములు తీసుకోవాలి.
- ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.
- వ్యాయామం లేదా అరగంట పాటు సూర్య నమస్కారం చేయండి.
- ఉదయాన్నే ప్రొటీన్లు అధికంగా ఉండే అల్పాహారం తీసుకోండి.
- రోజూ 7-8 గంటలు నిద్రపోండి.