మధుమేహాన్ని నియంత్రించడానికి, ఊబకాయం సమస్యను ఎదుర్కోవడానికి అనేక ఆహార మార్పులు చేయాలి. మధుమేహం తగ్గాలంటే చాలా మంది అన్నం తినకుండా ఉంటారు. అన్నం తింటు మధుమేహాన్ని తగ్గించవచ్చు. భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. చాలా మంది భారతీయులకు వైట్ రైస్ తినడం భోజనం లాంటిది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు పూటలా అన్నం తినే వారు ఉన్నారు. కానీ మధుమేహం, అధికబరువుతో బాధపడేవారు వైట్ రైస్ తినడానికి భయపడుతున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో అన్నం తినడానికి ఇష్టపడరు.
బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, కాబట్టి ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది కాకుండా, బియ్యంలో గ్లూటెన్ ఉండదు. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో, బియ్యంలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది చాలా మంచిది.
బియ్యాన్ని కళాయిలో వేసి తక్కువ మంట మీద వేయించాలి. ఇలా వేయించడం వల్ల అన్నంలో ఉండే పిండిపదార్థాలు తగ్గుతాయి, ఇది అన్నానికి రుచిని జోడిస్తుంది. వేయించడం ద్వారా స్టార్చ్ కంటెంట్ తగ్గిన తర్వాత, బియ్యం పొడిగా మరియు జిగటగా ఉండదు. ఇలా అన్నం వండుకుని తింటే డయాబెటిక్ పేషెంట్లకు వచ్చే నష్టమేమీ ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరగవు.