ఈ కాలంలో చాల మంది బీపీ తో బాధపడుతున్నారు. బీపీని తగ్గించుకోవడం కోసం ఎన్నో మందులు, మాత్రలు వేసుకుంటున్నారు. హై బీపీ మరియు లొ బీపీ లతో చాల సమస్యలు ఎదురుకుంటున్నారు. బీపీని నియంత్రించుకోవడానికి చాల మార్గాలు ఉన్నాయి వాటిలో యోగ ఒకటి. యోగా ద్వారా బీపీ తగ్గాలనుకునే వారు యోగా చేసే ముందు వైద్యులను సంప్రదించాలి. ఇంటర్నెట్‌లో చూస్తూ ప్రయోగాలు చేయవద్దు. అలా చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యోగా నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనాలు వేయాలి.
ఉత్తానాసనం: ఈ ఆసనం చేసేటప్పుడు వీపును వంచడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మన మెదడుకు మంచి రక్త ప్రసరణ అవసరం. ఇది మన నరాలను ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సేతుబంధాసనం: యోగాసనాలలో, సేతుబంధాసనం బిపిని తగ్గించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ ఆసనం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. తొడలు, కాళ్లు వంటి కండరాలు బలపడతాయి. సేతుబంధాసనం అనేది ఛాతీని పైకి లేపి, తలను క్రిందికి ఉంచి, నడుము మరియు కాళ్ళను కూడా పైకి లేపి చేసే ఆసనం. ఇది శరీరం మరియు మెదడులోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రక్తపోటును తగ్గిస్తుంది.