వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహా మూవీస్ మరియు ఎమ్3 మీడియా బ్యానర్స్ పై మహేంద్ర నాథ్ కుండ్ల నిర్మించిన "విరాజీ" సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ పొందింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది. నిర్మాత మహేంద్ర నాథ్ కుండ్ల మాట్లాడుతూ.. "మా చిత్రం 'విరాజీ' ఇటీవల సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసిన తర్వాత మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమ బ్యానర్ ద్వారా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా 'విరాజీ'ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందని సమాచారం. వరుణ్ సందేశ్ కొత్త అవతార్‌లో కనిపిస్తాడు. మైత్రీ మూవీస్ ద్వారా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ సందేశ్‌తో పాటు, రఘు కారుమంచి, ప్రమోధిని, బలం జయరామ్, వైవా రాఘవ్, రవితేజ నన్నిమల తదితరులు నటిస్తున్నారు. జి. అజయ్ కుమార్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ఎబినేజర్ పాల్ సంగీతం సమకూరుస్తున్నారు.