రెండేళ్ల కిందటే బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గతేడాది అమిగోస్‌ నిరాశపరిచింది. గతేడాది చివర్లో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం (NKR 21) చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు.

రీసెంట్‌గా ఈ NKR21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. దీని కోసం నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారు. దాదాపు 1000 మంది ఆర్టిస్టులతో క్లైమాక్స్ సీక్వెన్స్‌ని భారీగా చిత్రీకరించారు మేకర్స్. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రూ.8 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. ఇది సినిమాకు ముఖ్య ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *