ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప-2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబడుతోంది. వెయ్యి కోట్ల కలెక్షన్లు వసూలు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పుష్ప రాజ్, కేవలం తొమ్మిది రోజులకే రికార్డును సాధించింది. పుష్ప-2 ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ ఈవెన్‌కి దగ్గరగా ఉంది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా 11 రోజులకు గాను రూ. 1409 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏపాటిదో మరోసారి తెలియజేసింది. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. అటు బాలీవుడ్ లోను పుష్ప రాజ్ ర్యాంపేజ్ మాములుగా లేదు అని చెప్పాలి. అక్కడి స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ల సినిమాల ను సైతం వెనక్కి నెట్టి రికార్డ్ కలెక్షన్స్ అందుకుంది. ఇక 11 రోజులకు గాను ఒక్క హిందీలో రూ. 561.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండవ వారంలో కూడా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన మరో రికార్డును సాధించింది. ఈ లెక్కన చుస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో రూ. 2000 కోట్ల మార్క్ ను అందుకున్న ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *