AAA Multiplex: విశాఖపట్నంలో నిర్మాణం జరుపుకుంటున్న ఇనార్బిట్ మాల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మాల్ నగరానికి ఒక కొత్త ఆకర్షణగా మారనుంది. 2023లో 13 ఎకరాల విస్తీర్ణంలో దీనికి పునాది వేయగా, ఇది దక్షిణ భారతదేశంలో నిర్మించే అతిపెద్ద మాల్‌గా చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ మాల్‌లో ఆసియన్ అల్లు అర్జున్ (AAA) మల్టీప్లెక్స్‌కు శుభారంభం చేశారు.
జూలై 10న ఆసియన్ సునీల్, అల్లు అరవింద్ తదితరులు విశాఖ చేరుకుని AAA మల్టీప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. పది నెలలలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. థియేటర్ ఇంటీరియర్ డిజైన్ కోసం అల్లు అర్జున్ ఇప్పటికే నిపుణులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఫర్నీచర్ మొత్తం విదేశాల నుండి తీసుకురానున్నారు. AAA మల్టీప్లెక్స్‌లో మొత్తం 8 స్క్రీన్స్ ఉండనున్నాయి. విశాఖలోనే అత్యంత లగ్జరీ థియేటర్‌గా ఇది అభివృద్ధి చేయబడుతోంది. 2026 సమ్మర్ లో ఇది ప్రారంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు AAA మల్టీప్లెక్స్ ఒకటి ఉంది.
Internal Links:
హైదరాబాద్‌లో రెహమాన్ మ్యూజిక్ ఫీస్ట్..
చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటించడంపై వెంకటేశ్ క్లారిటీ..
External Links:
విశాఖలో ‘అల్లు అర్జున్’ మల్టీఫ్లెక్స్ పనులకు శ్రీకారం.. ఎన్ని స్క్రీన్స్ అంటే..