Allari Naresh “Alcohol” Movie Teaser: అల్లరి నరేశ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా పేరు ‘ఆల్కహాల్’. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తే ఇది థ్రిల్లర్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తోంది. మద్యం హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు-తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు, వాటి వల్ల జరిగే సంఘటనలను చూపించారు.
హాస్యంతో పాటు అన్ని రకాల పాత్రల్లో మెప్పించిన నరేశ్, ఈసారి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. సత్య కూడా కొత్తగా నటించారు. ‘ఫ్యామిలీ డ్రామా’తో పేరు తెచ్చుకున్న మెహర్ తేజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గిబ్రాన్ సంగీతం, చేతన్ భరద్వాజ్ బీజీఎమ్ అందిస్తున్నారు. 2026 జనవరి 1న సినిమా విడుదల కానుంది.
Internal Links:
వణుకు పుట్టిస్తున్న‘కిష్కిందపురి’ ట్రైలర్..
ఇక పాన్ ఇండియా కాదయ్యా.. పాన్ వరల్డ్ అనాలేమో..
External Links:
అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’.. కిక్ ఎక్కేలా ఉంది