టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం దక్కింది. మ్యాగజైన్ ఇండియాలో కొత్తగా ఎడిషన్ స్టార్ట్ చేసింది. ది ‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో ఈసంచికని ఇటీవలే ప్రారంభించింది. ఇందులో మొదటి కవర్ పేజీపై అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకురావడం విశేషం.
అల్లు అర్జున్ ది రూల్ పేరిట కవర్ పేజీ కథనం కూడా రూపొందించారు. అల్లు అర్జున్ హీరోగా తెలుగులో తీసిన పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేర్కొంది. అల్లు అర్జున్ ను స్టార్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించింది. కాగా, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1,871 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.