Allu Arjuns Emotional Moment: అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) శుక్రవారం అర్థరాత్రి వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ వార్తతో అల్లు, కొణిదెల కుటుంబాల్లో దుఃఖం అలుముకుంది. కనకరత్నమ్మ, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తల్లి కావడంతో చిరంజీవి కుటుంబానికి ఇది పెద్ద లోటుగా మారింది. ఈ సందర్భంగా చిరంజీవి Xలో పోస్ట్ చేస్తూ, ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, విలువలు ఎప్పటికీ ఆదర్శమని, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కనకరత్నమ్మ మరణవార్త తెలిసిన వెంటనే ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని పార్థివదేహానికి నివాళులర్పించారు. తన నానమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి వచ్చి నివాళులర్పించారు. అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు అరవింద్, చిరంజీవి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, నాగచైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వెంకటేష్, జీవిత రాజశేఖర్ తదితర సినీ ప్రముఖులు హాజరై చివరి వీడ్కోలు పలికారు. ఆమె మృతి తెలుగు సినీ పరిశ్రమలో కూడా విషాదాన్ని మిగిల్చింది.
Internal Links:
లేహ్ లో చిక్కుకుపోయిన మాధవన్..
External Links:
ఆశీర్వాదం తీసుకున్న చేతులతో.. నానమ్మ మృతిపై ఐకాన్ స్టార్ భావోద్వేగం..