AR Rahman: ఆస్కార్ అవార్డు విజేత, సంగీత మేధావి ఏ.ఆర్. రెహమాన్ తన అభిమానులకు ఉత్సాహాన్ని పంచే వార్త చెప్పారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆయన హైదరాబాద్‌లో మళ్లీ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని AR Rahman స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న తన ‘వండర్‌మెంట్ టూర్’లో భాగంగా హైదరాబాద్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. 2017లో ఆయన నగరంలో జరిగిన మెగా షోలో పాల్గొన్న తర్వాత ఇది ఆయనకు మొదటి ప్రదర్శన. దీంతో సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ కాన్సర్ట్‌కు సంబంధించి రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. “హలో హైదరాబాద్! భారత్‌లో అతిపెద్ద మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు మీ నగరానికి రాబోతోంది. 2017లో 25 వేల మంది కలిసి ‘మా తుఝే సలామ్’ పాడిన స్మరణీయ క్షణం గుర్తుందా? అది సంగీత చరిత్రలో నిలిచిపోయింది. ఈసారి మరింత గొప్పగా చేయాలని ఉంది” అంటూ తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఈవెంట్‌ను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అభిమానులు ముందుకొస్తున్నారు.
Internal Links:
చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటించడంపై వెంకటేశ్ క్లారిటీ..
విశ్వంభర వస్తున్నాడు, సెప్టెంబర్ 18న విడుదల..
External Links:
ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌లో రెహమాన్ మ్యూజిక్ ఫీస్ట్!