నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రం. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో సినిమా గురించి బజ్ పెరిగింది.

కాగా నేడు, ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ఓవర్సీస్ టాక్ ఎలా ఉందొ చూద్దాం. ఆసక్తికరమైన తల్లి-కొడుకుల సెటప్‌తో ప్రారంభమయి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనుకునేలోపే ఒక రొటీన్ రెగ్యూలర్ టెంప్లేట్ కమర్షియల్ చిత్రంగా మారుతుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. కానీ ఊహించదగిన స్క్రీన్‌ప్లే సినిమా ఫ్లోని అడ్డుకుంటుంది. ఓన్లీ క్లైమాక్స్ నే నమ్ముకున్న దర్శకుడు మిగిలిన సినిమా మొత్తాన్ని రొటీన్ గా తెరకెక్కించాడు. చివరి 20 నిముషాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అందుకు ఒప్పుకున్నందుకు నందమూరి కల్యాణ రామ్ ను అభినందించాలి. సంగీతంతో పాటు నేపధ్య సంగీతం ఇంకాస్త బాగుంటే బాగుండేది. చాలా సినిమాల్లో మనం చూసిన రొటీన్ ట్రీట్‌మెంట్‌ తో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించింది. కథ, స్క్రీన్ ప్లే పై ఇంకాస్త వర్క్ చేసి డైరెక్షన్ కొత్తగా చేసి ఉంటే సూపర్ హిట్ గా నిలిచేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *