అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు తమ మూడవ ప్రొడక్షన్, యువ హీరో నటిస్తున్న మెడికో-థ్రిల్లర్ కోసం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వంలో టి.వంశీధర్ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో అశ్విన్ బాబు సరసన రియా సుమన్ నటిస్తుంది.
హైదరాబాద్, వైజాగ్, కొడైకెనాల్ సహా పలు లొకేషన్లలో 75% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. గౌర హరి సంగీతం సమకూరుస్తుండగా, ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్. సురేష్ (బేబీ సురేష్) కళా దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర యూనిట్ అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్బంగా, కొత్త పోస్టర్‌తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు, అందులో సగం ఇండియా మ్యాప్‌తో అశ్విన్ బాబు ముఖం చిత్రం, మొత్తం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని సూచిస్తుంది.