Athadu Re Release: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2005లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేశ్ బాబు పార్థు పాత్రలో తన శాంతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని మహేశ్ స్టైల్ డైలాగులు, బ్రహ్మానందం కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా మెప్పించాయి. బుల్లితెరపై ఎన్నోసార్లు ప్రసారమై రికార్డులు సృష్టించిన ‘అతడు’ ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది.
టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ మహేశ్ బాబు ‘పోకిరి’తో మొదలైనప్పటి నుంచి ‘ఒక్కడు’, ‘మురారి’, ‘ఖలేజా’ వంటి సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘అతడు’ 4K క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఇప్పటికీ సినిమా మీద అభిమానుల క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఓవర్సీస్ లో బుకింగ్స్ హైలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. నైజాంలో ఏషియన్ సంస్థ విడుదల చేస్తుండగా, ఏపీలో ప్రముఖ పంపిణీదారులు హక్కులు దక్కించుకున్నారు. బర్త్‌డే, వీకెండ్, కొత్త సినిమాలు లేకపోవడంతో ‘అతడు’ రీరిలీజ్ భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.
Internal Links:
ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత..
External Links:
‘అతడు’ రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడు