ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015లో విడుదలైనప్పుడు భారీ విజయాన్ని సాధించింది. భారతదేశం మరియు విదేశాలలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రభాస్, రానా, అనుష్క మరియు తమన్నా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం టాలీవుడ్ ముఖచిత్రాన్ని, ముఖ్యంగా రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్ మరియు స్టార్ సీనియర్ నటుల కెరీర్‌లను మార్చివేసింది. ఈ కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు మరియు సంగీతం ఎం.ఎం. కీరవాణి అందించారు. అయితే, ఈ చిత్రం ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇప్పుడు స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. అలా ‘బాహుబలి’ ప్రపంచ యాత్రలో మరో ఘట్టాన్ని చేరుకుంది. అయితే ఈ మూవీను అంతర్జాతీయ మాధ్యమాల్లో మరింత విస్తృతంగా పరిచయం చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం, గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇది మంచి డెసిషన్ అనుకోవచ్చు. ప్రజంట్ ప్రభాస్ రెజ్ ఏంటో మనకు తెలుసు సో అది కూడా మరింత ప్లేస్ అవ్వనుంది