చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మాకే సొంతం అని నందమూరి బాలకృష్ణ అంటుంటారు. అది ఆయన సీరియస్ గా అంటారో లేక సరదాగా అంటారో కానీ అది నిజమే అనిపిస్తుంది. నేటితో సినీ నటుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ సినిమాతో బాలయ్య సినీ రంగ ప్రవేశం చేశారు. సాధారణంగా 30 ఏళ్లు లేదా 40 పూర్తి చేసుకున్న హీరోలు ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అవుతారు. బాలయ్య మాత్రం ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు.

ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది. బాలయ్య తన సినీ ప్రయాణంలో ఎన్నో ఘన విజయాలు సాధించారు. తండ్రి ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తిరుగులేని నటుడిగా కొనసాగుతున్నారు. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న బాలయ్యను సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించబోతోంది.సెప్టెంబర్ 1న దక్షిణాది సినీ పరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు ఘన సన్మానం చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *