నందమూరి బాలకృష్ణ ఎన్‌బికె అన్‌స్టాపబుల్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఉంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్లాన్ చేసి తేదీని ప్రకటించారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 22న ప్రసారం కానుంది. ఇప్పుడు రికమండేషన్ ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమో కూడా ఓవ‌ర్‌రేట్ అయింద‌ని అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలు హాజరు అయి షోకు ఎట్రాక్షన్ తీసుకొచ్చారు.

మరి ఇందులో అల్లు అర్హ మాత్రం అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ, అర్హ నీకు తెలుగు వచ్చా అని అడిగేసరికి అర్హ, పదో క్లాస్‌లో చాలామంది చదువుకున్న ‘అటజనికాంచె భూమిసురు డంబరచుంబి..’ అనే పద్యాన్ని ఆపకుండా అవలీలగా చెప్పేసింది. దీంతో అర్హ టాలెంట్ కు బాలయ్య బాబు ఫిదా అయిపోయాడు. నవంబర్ 22 శుక్రవారం రోజున ఈ ప్రోమో తాలూకూ ఫుల్ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ 22న వచ్చే ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు సాలిడ్ ప్రాజెక్ట్ “డాకు మహారాజ్” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానుల్లో ఓ రేంజ్ లో హైప్ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *