BigBoss Season 9: బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈసారి ఆరుగురు సామాన్యులకు అవకాశం దక్కింది. ‘అగ్నిపరీక్ష’లోని టాప్ 13 కంటెస్టెంట్స్‌లో కేవలం ఆరుగురికి మాత్రమే ఎంట్రీ లభించగా, మిగతా ఏడుగురికి అవకాశం దొరకలేదు. అయితే తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వారిలో ఇద్దరికి అవకాశం ఇవ్వవచ్చు. కల్యాణ్ పడాల, హరిత హరీష్ (మాస్క్ మ్యాన్), ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ ఈ ఆరుగురు కామనర్స్‌గా హౌస్‌లోకి వచ్చారు.
ఇక తొమ్మిది మంది సెలబ్రెటీలు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో రీతూ చౌదరి, ఇమానుయేల్, ఫ్లోరా సైనీ, సంజనా గల్రానీ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ఠి వర్మ, తనూజ పుట్టస్వామి ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ కలిసి ఈ సీజన్‌ను ప్రత్యేకంగా మార్చనున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం ప్రకారం, ఇవాళ రాత్రి 10:20 నుంచి BiggBossTelugu9 24/7 లైవ్‌లో ప్రసారం కానుంది.
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లిస్ట్:
- తనూజ పుట్టస్వామి
- రీతూ చౌదరి
- ఇమానుయేల్
- ఫ్లోరా సైనీ
- సంజనా గల్రానీ
- సుమన్ శెట్టి
- రాము రాథోడ్
- భరణి
- శ్రేష్ఠి వర్మ
- కల్యాణ్ పడాల
- హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్)
- ప్రియా శెట్టి
- శ్రీజ దమ్ము
- డెమన్ పవన్
- మర్యాద మనీష్
Internal Links:
ఇండస్ట్రీ హిట్ కొట్టిన డబ్బింగ్ సినిమా..
External Links:
‘బిగ్ బాస్’ సీజన్ 9.. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు కామనర్స్ వీళ్లే.. 15 మంది ఫుల్ లిస్ట్ ఇదే..