News5am, Breaking Latest News (27-05-2025): ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు రెండోసారి నోటీసులు పంపించారు. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తమ పాలనా వైఫల్యాలను దాచేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ చర్య తీసుకుందని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ యత్నాల్లో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మా పార్టీ నేతలకు వరుసగా నోటీసులు పంపడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎంత ఇబ్బందులు కలిగించినా బీఆర్ఎస్ నాయకులు ధైర్యంగా ఎదుర్కొంటారని, కేసీఆర్ సైనికుల చరిత్ర అదేనని ఆమె ఎక్స్‌లో వెల్లడించారు.
More Latest News:
Political Latest News:
రాహుల్ గాంధీతో సీఎం కీలక చర్చలకు సిద్ధం..
కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
More Breaking Latest News: External Sources
కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..