News5am, Breaking Latest News (02-06-2025): ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది. కొంత విరామం తర్వాత, తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్పెషల్ సాంగ్ ద్వారా మళ్లీ ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కిషోర్ అబ్బూరి. ఈ పాట కోసం అనన్యను సంప్రదించగా, ఆమె కూడా అంగీకారం తెలిపిందని టాక్. త్వరలోనే ఈ పాటను షూట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది అఖిల్ కెరీర్‌లో 6వ సినిమా కాగా, శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాను నవంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
More Updates:
Breaking Cinema News:
చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..
‘రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
More News: External Sources
అఖిల్ మూవీలో అనన్య పాండే ఐటమ్ సాంగ్..