News5am, Breaking Movie News (14-05-2025): ZEE5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ 8.6 IMDb రేటింగ్‌తో మంచి విజయాన్ని సాధించింది. కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రల్లో, రమేష్ ఇందిర దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఇప్పటికే హిట్ అయింది. చిక్ మంగళూర్ నేపథ్యంలో సాగే ఈ కథ ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ తిరుగుతుంది. ప్రతి మరణం కొండయ్య దేవత శాపం వల్లే జరిగిందని నమ్ముతారు. జాజీ (ఖుషీ రవి) ఆ కుటుంబంలోకి వచ్చాక తన ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకుని, పనిమనిషి తాయవ్వ, పోలీస్ ఆఫీసర్ మహానేష్ సహాయంతో ఇంటి రహస్యాలను వెలికి తీయడం మొదలుపెడుతుంది. థ్రిల్లింగ్ కథనం, సస్పెన్స్, కుటుంబ భావోద్వేగాలతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది, దాంతో దక్షిణ భారతదేశం అంతటా మరింతగా విస్తరించనుంది. ఇందులో నటించిన ఖుషీ రవి మాట్లాడుతూ, ‘‘ఈ కథలో భాగమవడం ఆనందంగా ఉంది. నా పాత్ర చాలా సవాలుతో కూడినదిగా ఉంటుంది. ఇలాంటి కన్నడ కంటెంట్‌ను ప్రోత్సహించిన ZEE5, శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్‌కి ధన్యవాదాలు. ప్రేక్షకులు మా వెబ్ సిరీస్‌ని, నా పాత్రను ప్రేమతో ఆదరిస్తుండటం గర్వంగా ఉంది. ఇప్పుడు ఇది తెలుగులో కూడా విడుదల కాబోతుందంటే చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
More Breaking News
నేడు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..
ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24 ఎన్డీఏ కీలక భేటీ..
Movies News: External Sources
Breaking Movie News
రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’..