News5am, Breaking News Telugu (05-06-2025): సంక్రాంతి సినిమాల హడావుడి గురించి ముందే చెప్పక్కర్లేదు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతుండగా, వచ్చే సంవత్సరం కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో “మాస్ జాతర” చేస్తుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయింది. అలాగే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందుతోంది, దీని ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. దీన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి చిరంజీవి vs రవితేజగా మారనుంది.
వీరిద్దరితో పాటు తమిళ స్టార్ విజయ్ “జననాయగన్”, నవీన్ పోలిశెట్టి “అనగనగా ఒక రాజు” కూడా 2026 సంక్రాంతి రిలీజ్‌లుగా ఖరారయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు నాలుగు సినిమాలు బరిలోకి వచ్చాయి. అయితే మేజర్ క్లాష్ మాత్రం చిరు, రవితేజ మధ్యే జరగనుంది. అంతేకాకుండా బాలయ్య “అఖండ 2″ను కూడా సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయి, ఎందుకంటే ఇది దసరా నుంచి పోస్ట్‌పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పై పోటీ తారాస్థాయిలో ఉండనుంది.
More News:
Breaking News Telugu Latest News
ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..
More Breaking News: External Sources
చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!