News5am, Breaking News Telugu (07-06-2025): ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ టీజర్ జూన్ 7న విడుదలైంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్ ఉత్కంఠను కలిగిస్తోంది. ఇందులో ఆది ఒక భౌగోళిక శాస్త్రవేత్తగా కనిపించాడు. టీజర్ ప్రారంభంలో “ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.” అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక ఉల్కలాంటి రాయి ఊరిలో పడటంతో అక్కడి ప్రకృతిలో మార్పులు, ప్రజల విచిత్ర ప్రవర్తన, అనూహ్య మరణాలు మొదలవుతాయి. ఈ సంఘటనల వెనుక ఉన్న రహస్యం ఏమిటనేది సినిమా ద్వారా తెలుస్తుంది.
‘శంభాల’ సినిమాకు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మంచి ఆసక్తిని కలిగించాయి, ముఖ్యంగా ఒక పోస్టర్‌లో కనిపించిన వేషం, ఖాళీ గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో రాక్షస ముఖం. సినిమా మీద క్యూరియాసిటీ పెంచింది. ఇప్పుడు టీజర్ ఆ ఉత్కంఠను మరింత పెంచింది. ఈ సినిమా ఆది సాయికుమార్‌కి మంచి బ్రేక్ అవుతుందని కనిపిస్తోంది. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు యుగంధర్ ముని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందినవాడు, హాలీవుడ్ స్థాయి టెక్నిక్స్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నాడు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు, ఆయన ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్‌తో కలిసి పనిచేశారు.
More Breaking News Latest Telugu:
News Telugu:
మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
2026 సంక్రాంతికి చిరంజీవి vs రవితేజ..
More Breaking News Movies: External Sources
సరికొత్త పాయింట్‌తో ఆది హారర్ థ్రిల్లర్..