News5am, Breaking News Telugu News (05/05/2025) : టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఇటీవలి కాలంలో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం మండాడి. ఈ సినిమాలో సుహాస్, కోలీవుడ్ నటుడు సూరితో కలిసి నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు మతిమారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో సుహాస్ ఊర మాస్ లుక్‌లో వైల్డ్‌గా, గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్డ్ స్టైల్లో కనిపిస్తున్నాడు. ఆయన టీషర్ట్, లుంగీ ధరించి విలేజ్ గైలా కనిపిస్తున్నాడు. టీషర్ట్ మీద “టి సునామీ రైడర్స్” అనే పదాలు రాసి ఉన్నాయి, దీని ద్వారా ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంపై తెరకెక్కుతున్న సినిమా అనిపిస్తోంది.
మరొక పోస్టర్లో సూరి, సుహాస్ సముద్రంపై పడవల్లో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ రెండు పోస్టర్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సుహాస్ ఇంతవరకు ఇలాంటి రగ్డ్, సీరియస్ లుక్‌లో కనిపించడం ఇదే తొలిసారి. అతని కొత్త అవతారం చూసి ఈ మూవీపై ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమాపై టాలీవుడ్లో అంతగా చర్చ లేకపోయినా, ఈ ఒక్క పోస్టర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు సుహాస్. మంచి కథలను ఎంచుకునే ఈ యాక్టర్, “మండాడి”లో మరోసారి తన టాలెంట్ ఏ విధంగా చూపించబోతున్నాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
More News:
Breaking News Telugu:
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీ..
మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు..
More Breaking Big News: External Sources
Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..