News5am, Telugu Breaking Updates (31-05-2025): టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ ఒకటి. చిరు రెండవ ఇన్నింగ్స్ మొదలైనప్పటి నుంచి పెద్దగా విజయాలు దక్కలేదు, ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలు తీసుకోవడం వల్ల ఫ్యాన్స్ పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయారు. అయితే అనిల్ రావిపూడి కమెర్షియల్ మాస్టర్ అని అందరికీ తెలుసు. నయనతార లాంటి తక్కువ ప్రమోషన్స్ చేసే నటి చేత మూవీ ప్రోమో చేయించి, అనౌన్స్ చేయించడమే కాకుండా చిరు కామెడీ యాంగిల్‌ను ఈ సినిమాలో పూర్తిగా చూపించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్లాడు. అందుకే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్‌ను అనిల్ రావిపూడి టీం ఆశించిన దానికంటే వేగంగా పూర్తి చేసింది, అంతేగాక ఒక రోజు ముందే షెడ్యూల్ ముగించారని సమాచారం. ఇది చూస్తే ఈ ప్రాజెక్ట్‌పై టీం ఎంత డెడికేషన్‌తో పనిచేస్తుందో స్పష్టమవుతుంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కావచ్చని టాక్.
More Breaking Telugu News Today:
Telugu Breaking Updates
జాన్వీకపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ..
థియేటర్లో శివాలెత్తిపోతున్న మహేష్ ఫ్యాన్స్..
More Breaking News Buzz: External Sources
చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..