News5am, Breaking Telugu News (04-06-2025): విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. ఈ సినిమా మే 30న రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో జూలై 4కి వాయిదా వేసారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
అయితే విడుదల ఆలస్యం కావడం వెనక రీషూట్‌లు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. దర్శకుడు గౌతమ్ ఫైనల్ కట్‌పై సంతృప్తిగా లేకపోవడంతో కొన్ని సీన్లు మళ్లీ షూట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మేకర్స్, “మా సినిమా ఎలాంటి రీషూట్ చేయడం లేదు. వాయిదా వేయలేదు. అనుకున్న తేదీకే మేము సినిమా రిలీజ్ చేస్తాం. తుఫాను రాకముందు నిశ్శబ్దంలా ఇది” అని తెలిపారు. విజయ్‌కు ‘డియర్ కామ్రేడ్’, ‘లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు ఫ్లాపైగా, ‘ఖుషీ’ ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు ‘కింగ్‌డమ్’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
More Breaking Telugu News Movies:
Cinema Telugu News:
రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..
‘వీరమల్లు’ ట్రైలర్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
More Breaking News: External Sources
‘కింగ్డమ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!