News5am,Breaking Telugu New (09-05-2025): యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “డ్రాగన్”. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ బ్యానర్స్ మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “దేవర” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో, ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏప్రిల్ 22న యంగ్ టైగర్ ఎన్టీఆర్ “డ్రాగన్” సెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ కర్ణాటకలో పూర్తయింది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరణను ప్రశాంత్ నీల్ ముగించారు. ఈ ఫైట్స్ సినిమా ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత రెండవ షెడ్యూల్ కోసం మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. అలాగే మలయాళ యువ హీరో టోవినో థామస్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు ఈ సినిమాకు భారీ రేటులో డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్‌ను ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. “కేజీఎఫ్” ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
More Breaking Telugu News
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
More Breaking Telugu New: External Sources
NTR 31 : ఎన్టీఆర్ – నీల్ సినిమా రిలీజ్ డేట్ మారింది.. టీజర్ డేట్ వచ్చింది