News5am, Telugu News Updates (15-05-2025): టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో వెళ్లడమే కాకుండా, ట్రాఫిక్ పోలీసుపై అనుచితంగా ప్రవర్తించినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జర్నలిస్టుల కాలనీలో నివాసముండే సాయి శ్రీనివాస్ తన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మద్యం సేవించి కారు నడిపినట్టు అనుమానం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశముంది. ఇప్పుడు ఈ ఘటనపై హీరో బెల్లంకొండ సాయి ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.
మే 13వ తేదీ మంగళవారం సాయంత్రం, బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్టుల కాలనీలో రాంగ్ రూట్‌లో కారు నడిపాడు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ దృశ్యాన్ని ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
More Telugu Updates:
Telugu News Updates:
తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం
More Updates: External Sources
https://www.ap7am.com/tn/829392/bellamkonda-sai-sreenivas-booked-by-hyderabad-police