News5am, Breaking Telugu News (28-05-2025): నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు కల్యాణ్ రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. వీరిద్దరూ ఒకే వాహనంలో అక్కడికి చేరుకుని, తాత ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీనితో అక్కడ భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మే 28వ తేదీని రాష్ట్ర అధికారిక వేడుకల దినంగా నిర్వహించాలన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది.
More News:
Telugu Breaking News Latest
ప్రభాస్ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా..
తేజ సజ్జా ‘మిరాయ్’ టీజర్‌కు డేట్ ఫిక్స్ ..
More Breaking News: External Sources
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి!