News5am,Breaking News Telugu Online(24-05-2025): టాలీవుడ్‌లో విషాదం జరిగింది. ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ మరణించారు. అనారోగ్యం కారణంగా మే 23న రాత్రి ఆయన కన్నుమూశారు. 54 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. ముకుల్ దేవ్ ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఐసియూలో ఉన్న సమయంలో మరణించినట్లు సమాచారం. నటి దీప్‌శిఖా నాగ్‌పాల్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటోతో “RIP” అని పోస్ట్ చేశారు.
ముకుల్ దేవ్ బాలీవుడ్‌లో 1996లో దస్తక్ సినిమాతో అడుగుపెట్టారు. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్ వంటి సినిమాల్లో నటించారు. అదుర్స్, నిప్పు, కేడి, బెజవాడ, భాయ్ చిత్రాల్లో కనిపించారు. హిందీలో సన్ ఆఫ్ సర్దార్, జై హో వంటి సినిమాల్లో నటించారు. అలాగే పంజాబీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు.
టెలివిజన్ షోల్లోనూ నటించి ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన చివరి చిత్రం “అంత్ ది ఎండ్”. ముకుల్ దేవ్ తమ్ముడు రాహుల్ దేవ్ కూడా నటుడే. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు.
More News:
Breaking News Telugu Online
ఖలేజా రీ-రిలీజ్‌కు ఊహించని బుకింగ్స్..
‘బెగ్గర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి..
More Breaking Latest News: External Sources
నటుడు ముకుల్ దేవ్ 54 ఏళ్ళ వయసులో మరణించారు