New Telugu Latest News 1

News5am, Breaking Telugu News (16-05-2025): తాజాగా హైదరాబాద్‌లోని AAA థియేటర్లో ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా టీజర్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ ఆకట్టుకోగా, రమ్య మోక్ష కంచర్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో చిట్టి పికిల్స్ ద్వారా ఇప్పటికే పరిచయమైన రమ్య.. ఈ వేడుకలో మెరిసి ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్‌లో చిన్నదైన రమ్య మోక్ష, సినీ రంగంలోకి రావాలని యత్నాలు చేస్తోంది. గతంలో ఓ వీడియోలో ఆమె “తాను రెండు సినిమాల్లో మేకప్ లేకుండా నటించాను” అని చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ ఈవెంట్‌కు ఆమె హాజరుకావడం, మీడియాలో కనిపించడం వైరల్ అవుతోంది. రమ్య ఈ సినిమాలో నటించిందా? అనే ప్రశ్నకు అధికారిక సమాచారం లేకపోయినా, అందిన సమాచారం ప్రకారం ఆమె ఇందులో పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అశ్విన్ బాబు హీరోగా, రియా సుమన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఈవెంట్‌లో రమ్య మోక్ష హాజరవ్వడంతో సినిమాతో ఆమెకు సంబంధం ఉందా? అనే ఆసక్తిని కలిగిస్తోంది.

More Breaking News:

Breaking Telugu News:

రూ.1,800 తగ్గిన బంగారం ధర..

తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు..

More Breaking Telugu News: External Sources

https://ntvtelugu.com/news/ramya-moksha-sparks-at-vachinavadu-gowtham-teaser-launch-photos-are-going-viral-799802.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *