News5am, Breaking Telugu New (08-05-2025): ఏమాయ చేసావేతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సమంత, ఆ సినిమా ఘన విజయంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇదే సమయంలో అక్కినేని కుటుంబ వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకొని, తర్వాత విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత టాలీవుడ్‌కు కొంత దూరంగా ఉంటూ, బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అదే సమయంలో వచ్చిన “ది ఫ్యామిలీ మేన్” వెబ్ సిరీస్‌లో ఆమె పాత్రకు విశేషమైన ప్రశంసలు లభించాయి. ఆ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో పడిందన్న వార్తలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
రాజ్–సమంతల మధ్య రిలేషన్ ఉందనే వార్తలు జోరుగా నడిచాయి. ఇక నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోనున్నాడన్న వార్తలతో పాటు సమంత కూడా త్వరలో పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే అవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా సమంత, ‘‘ఇది ఒక కష్టమైన ప్రయాణం. కానీ ఇక్కడిదాకా వచ్చాం. ఇది ఒక కొత్త ప్రారంభం’’ అంటూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు వేగంగా వైరల్ అయ్యాయి. ఇక సమంత నిర్మించిన చిత్రం ‘‘శుభం’’ మే 9న విడుదల కాబోతోంది. ‘సినిమా బండి’తో గుర్తింపు పొందిన ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు. ‘సినిమా బండి’కి రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించగా, ఆయన తర్వాతి చిత్రానికి సమంత నిర్మాతగా వ్యవహరించడం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో సమంత చెప్పిన “న్యూ బిగినింగ్” వెనుక నిజమైన సంగతేంటో తెలియాల్సి ఉంది.
More Breaking Telugu News
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
More Breaking Telugu New: External Sources
Samantha : రాజ్ తో కలిసి ‘కొత్త ప్రారంభం’.. సమంత పోస్ట్ వైరల్