అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో చాలా సినిమాలు చేసింది. ఆ సినిమాలేవీ ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకురాలేకపోయాయి. అందుకే తెలుగులో అదృష్టాన్ని వెతుక్కుంటూ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కానీ దేవర మొదటి భాగంలో శ్రీదేవి కూతురు చాలా కాలంగా కనిపించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. కనిపించింది తక్కువే అయినా, హీరోయిన్ అనిపించుకోలేదంటూ రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె అభిమానులకు ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. అదేంటంటే, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 16వ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు.
సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ మైసూర్ లో, నవంబర్లో జరగబోతోంది. తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ కాబోతోంది. ఇక రామ్ చరణ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తన బాడీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. టీం కూడా ఇప్పటికే మిగతా పాత్రధారులు అందరినీ ఫైనలైజ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్ ను సైతం ఫైనల్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్గా మరొక బాలీవుడ్ హీరోయిన్ ని దింపే ప్రణాళికలు ఉన్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం ఒకే హీరోయిన్ మాత్రమే ఉంటుందని అది కూడా జాన్వీ కపూర్ మాత్రమేనని తెలుస్తోంది. ఈ సినిమాలో మరే ఇతర హీరోయిన్లు ఉండబోరు అని తెలుస్తోంది. ఒకరకంగా ఇది జాన్వీ కపూర్ కు మాత్రమే కాదు ఆమె అభిమానులకు కూడా కాస్త స్థిమితపరిచే వార్త అని చెప్పొచ్చు.