రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయనకు అభిమానులు చెప్పిన స్పెషల్ విషెస్తోనే నిండిపోయింది. అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా రెబల్‌స్టార్‌ను మెగాస్టార్ చిరంజీవి విష్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు చక్కర్లు కొడ్తుంది.
“ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ ప్రభాస్. అంటూ చిరు స్పెషల్‌గా విష్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు యూవీ క్రియేషన్స్, ప్రభాస్ స్నేహితుడు గోపిచంద్, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, వైజయంతి మూవీస్ కూడా డార్లింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.