చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్‌లో శ్రీలీల సంచలనం సృష్టించింది. మహిళా దినోత్సవం సందర్భంగా చిరు ఆమెను సత్కరించి ప్రత్యేక బహుమతిని అందజేశారు. చిరంజీవి ప్రధాన పాత్రలో వసిష్ఠ దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతోంది. అదే స్టూడియోలో మరో షూటింగ్‌లో ఉన్న శ్రీలీల ‘విశ్వంభర’ సెట్స్‌కు వెళ్లి చిరంజీవిని కలిసింది.
అదేరోజు మహిళా దినోత్సవం కావడంతో అక్కడే ఆమెకు శాలువా కప్పి దుర్గా దేవి రూపం ఉన్న శంఖాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీలీల, ‘విత్ ఓజీ.. మన శంకర్ దాదా ఎంబీబీఎస్.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు, మంచి ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్స్’ అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.