Chiru - Anil title teasers released

Chiru – Anil title teasers released: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఓ సినిమా వస్తోంది. సంక్రాంతి తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తరపున సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ జన్మదిన కానుకగా నేడు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో అభిమానుల మధ్య గ్లింప్స్ విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో “మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు” అన్న ట్యాగ్‌లైన్‌తో టైటిల్‌ను ప్రకటించారు. గ్లింప్స్‌లో చిరంజీవి లుక్ వింటేజ్ స్టైల్లో ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుంది.

Internal Links:

‘కిష్కింధపురి’ టీజర్ రిలీజ్..

కూలీ ఓవర్సీస్ రివ్యూ…

External Links:

చిరు – అనిల్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్.. అదిరిందిగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *